నారా లోకేశ్ డబ్బు ఇస్తే తీసుకోండి…వైసీపీకి ఓటు వేయండి అని కోరారు సీఎం జగన్. ఇవాళ మంగళగిరిలో సీఎం జగన్ ప్రచారం చేస్తూ… లోకేశ్ డబ్బు ఇస్తే తీసుకోండి… ఆ డబ్బు మనదే లోకేశ్ దోచేసిన సొమ్మేనని విమర్శలు చేశారు సీఎం జగన్. మీ ఎంఎల్ఏ అభ్యర్ధి నా చెల్లి లావణ్య ను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరుతున్నానని…. లావణ్య మీలో ఒకరు… మంగళగిరి సీటు బీసీ ల సీటు , వెనుకబడిన వర్గాల సీటు అన్నారు. అందుకే RK తో మాట్లాడి లావణ్య కు ఇచ్చానని తెలిపారు.
బటన్ నొక్కిన కూడా డబ్బులు రాకుండా అడ్డుకుంటున్న దౌర్భాగ్యక పరిస్థితి ఉంది…అక్కా చెల్లెమ్మలకు డబ్బులు అందాలని ముఖ్యమంత్రి స్థానంలో కోర్టుకు వెళ్తున్నాడు అంటే…వ్యవస్థలు ఎలా దిగజారాయే పోయేయో ఆలోచన చేయండని కోరారు జగన్. చేసిది ఏది…ఎన్నికల కోసం చేయలేదు…ఎన్నికలు మూడు నెలలు ఉండేసరికి… కుట్రలు కుతంత్రాలు చేస్తున్నారని ఆగ్రహించారు. ప్రభుత్వాన్ని ఐదు 5 ఏళ్లు…60 నెలల కోసం ఎన్నుకుంటారు… కానీ57 నెలలకే ఈ ప్రభుత్వాన్ని గొంతు పట్టుకొని పిసికి వేయాలని ఆలోచన చేస్తున్నారని మండిపడ్డారు జగన్.