హరీష్ రావు రాహుల్ గాంధీకి లెటర్ రాశాడు. అయితే హరీష్ రావు లెటర్ రాసింది మూసి బాధితుల కోసం కాదు. రేవంత్ రెడ్డి కి వస్తున్న ఆదరణ తట్టుకోలేక రాహుల్ గాంధీకి లేక రాసిండు అని ఎంపీ మల్లు రవి పేర్కొన్నారు. మూసీని అభివృద్ధి చేయాలని సీఎం రేవంత్ రెడ్డికి పెద్ద ఎత్తున దరఖాస్తులు వస్తున్నాయి. బలవంతంగా పేద ప్రాజల పొట్టగొట్టాలనే ఉద్దేశం కాంగ్రెస్ ప్రభుత్వానికి లేదు. 500 లకే గ్యాస్, 200 యూనిట్ల కరెంట్ ఉచితంగా ఇస్తున్న పేదల పక్షపాతి కాంగ్రెస్ ప్రభుత్వం. మూసి పై డిపిఆర్ ఇంకా కాలేదు,పనులు స్టార్ట్ కాలేదు, డబ్బులు డ్రా చేయలేదు అవినీతి జరిగిందని కేటీఆర్ అంటుండు. కానీ ప్రతి పక్ష నాయకుడిగా హైడ్రా పై కేసీఆర్ ఎందుకు మాట్లాడటం లేదు. అయినా కేసీఆర్ కు క్యాబినెట్ ర్యాంక్ ఎందుకు ఇచ్చింది.. ఫామ్ హౌస్ లో పడుకోవడానికా అని ప్రశ్నించారు.
అలాగే తప్పుడు ప్రచారం చేస్తే కాంగ్రెస్ కు లాభమే కానీ నష్టం లేదు. తప్పుడు ప్రచారం వలన బీఆర్ఎస్ పార్టీకే నష్టం. మూసీ నది వలన హైదరాబాద్ దుర్గంధంగా మారింది. కేసీఆర్ మూసీపై అప్పుడే కమిటీ వేశారు. ఎందుకు ప్రక్షాళన జరగలేదో ప్రజలకు తెలుసు. డబ్బులు లేకపోయినా సీఎం రేవంత్ రెడ్డి మూసీ, హైడ్రా ను తెచ్చి హైదరాబాద్ ను అభివృద్ధి చేస్తున్నారు అని మల్లు రవి తెలిపారు.