నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. సర్కారు కొలువులకు గరిష్ఠ వయోపరిమితి 46 ఏళ్లు

-

తెలంగాణలో సర్కార్ నౌకరీ కోసం ప్రయత్నించే నిరుద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు చెప్పింది. యూనిఫాం సర్వీసులు మినహా, ఇతర ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రస్తుతం ఉన్న గరిష్ఠ వయో పరిమితిని 44 నుంచి 46 ఏళ్లకు పెంచుతున్నట్లు తెలిపింది. ఈ వయో పరిమితి పెంపు రెండేళ్ల పాటు అమల్లో ఉంటుందని స్పష్టం చేసింది. ఈ మేరకు ఈ నెల 8వ తేదీన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఉత్తర్వులు జారీ చేశారు.

- Advertisement -

రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాలకు గరిష్ఠ వయో పరిమితి గతంలో 34 ఏళ్లుగా ఉండగా.. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తరువాత 2015లో ఈ పరిమితిని 10 ఏళ్లు పొడిగిస్తూ 44 ఏళ్లుగా ఖరారు చేశారు. ఆ ఉత్తర్వు రెండేళ్ల వరకు అమల్లో ఉంటుందని నాడు పేర్కొన్నగా.. ఆ తరువాత 2022లో మరోసారి గరిష్ఠ వయోపరిమితి 44 ఏళ్లుగా ప్రభుత్వం ఖరారు చేసింది. దీన్ని మరింత సడలించాలని నిరుద్యోగుల నుంచి విజ్ఞప్తులు వచ్చాయి. దీంతో మరో రెండేళ్ల సడలింపు ఇవ్వాలంటూ టీఎస్‌పీఎస్సీ కార్యదర్శి ఈ నెల 3వ తేదీన ప్రభుత్వానికి లేఖ రాశారు. ఈ నేపథ్యంలో సర్కారు కొలువులకు గరిష్ఠ వయోపరిమితిని 44 నుంచి 46 ఏళ్లకు పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

జీతం అడిగితే నోటితో చెప్పులు మోయించారు…!

సమాజంలో నేడు పరిస్థితులు ఎలా ఉన్నాయంటే కష్టపడి నెలంతా పనిచేసినా కానీ...

ఢమాల్: కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు…అన్ని రంగాలు డౌన్ !

విజయదశమి రోజున ముదుపర్లకు భారీగా నష్టాలు వచ్చినట్లుగా తెలుస్తోంది. ఈ రోజు...