మేడారం మహాజాతర సమయంలోనే కోయ ఇలవేల్పుల సమ్మేళనం నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. 2018-2022 వరకు మేడారం జాతరకు రెండు నెలల ముందే ఈ సమ్మేళనం నిర్వహించారు.
అయితే జాతర సమయంలోనే ఈ సమ్మేళనం నిర్వహిస్తే గిరిజన సాంస్కృతిక వైభవం ఇతర భక్తులకు తెలిసే అవకాశం ఉందని మంత్రి సీతక్క అధికారులకు సూచించారు. ఈ మేరకు గిరిజన సంక్షేమ శాఖ కసరత్తు చేస్తుంది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 21 నుంచి నాలుగు రోజులపాటు జాతర జరగనుంది.
కాగా, ఫిబ్రవరి 21 నుంచి మేడారం జాతర ప్రారంభం కానుందని మంత్రి సీతక్క తెలిపారు. ఆసియాలోనే అతిపెద్ద ఆదివాసీ జాతరను జయప్రదం చేస్తామని..ఫిబ్రవరి 21 నుంచి జాతర ప్రారంభం అవుతుందన్నారు. ఇప్పటికే రూ. 75 కోట్ల నిధులు సీఎం రేవంత్ రెడ్డి మంజూరు చేశారు…రేవంత్ రెడ్డి పాదయాత్ర సైతం మేడారం దేవతల సన్నిధి నుండే ప్రారంభించారని గుర్తు చేశారు మంత్రి సీతక్క.