ఆర్థికాభివృద్ధి ప్రయోజనాలు అందరికీ దక్కడం లేదు : రాహుల్

-

ఆర్థికాభివృద్ధి ప్రయోజనాలు అందరికీ దక్కడం లేదన్నారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. భారత్ లో ఆర్థిక వృద్ధి నమోదవుతుంది కానీ…. కొద్దిమంది వద్దే సంపద కేంద్రకృతం అవుతుందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు. ‘ఆర్థికాభివృద్ధి ప్రయోజనాలు అందరికీ దక్కడం లేదు. నిరుద్యోగం పెరుగుతుంది. సంపద సృష్టించే ఉత్పత్తి ఆధారిత ఆర్థిక వ్యవస్థను ఏర్పాటు చేయడం దేశం ముందున్న సవాల్. దేశంలో కులం నిజమైన సమస్య.

Rahul Gandhi

భారత్ ను ‘ఒకే భావజాలం, ఒకే మతం, ఒకే భాష’ కలిగిన దేశంగా బీజేపీ భావిస్తోంది’ అని ఆరోపించారు.కాగా, లోక్ సభ ఎన్నికల కోసం వ్యూహాలు రచిస్తున్న కాంగ్రెస్ పార్టీ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. యూపీ ఇన్చార్జ్ బాధ్యతల నుంచి ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీని తప్పించింది. ఆమెకు ఎలాంటి పోర్ట్ ఫోలియో కేటాయించలేదు. మహారాష్ట్రకు చెందిన సీనియర్ నేత అవినాష్ పాండేకు యూపీ కాంగ్రెస్ బాధ్యతలు అప్పగించింది. ఇక రాజస్థాన్ మాజీ ఉపముఖ్యమంత్రి సచిన్ పైలట్ ను ఛత్తీస్ గడ్ ఇన్ చార్జ్ గా నియమించింది.

Read more RELATED
Recommended to you

Latest news