మేడిగడ్డ బ్యారేజీకి భారీ వరద.. 85 గేట్లు ఎత్తి నీటి విడుదల

-

రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజీకి వరద ప్రవాహం భారీగా వచ్చి చేరుతోంది. తెలంగాణతో పాటు మహారాష్ట్రలో విస్తారంగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఎగువ ప్రాంతం నుంచి భారీ వరద చేరుతోంది. మేడిగడ్డ బ్యారేజీకి 4,06550 క్యూసెక్కుల మేర ప్రవాహం వస్తుండడంతో 85 గేట్లు ఎత్తి అంతే స్థాయిలో నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.

గత అక్టోబర్లో మేడిగడ్డ బ్యారేజీ దెబ్బతిని, కుంగిపోవడంతో నేషనల్ డ్యాం సేఫ్టీ అథారీటి (ఎన్డీఎస్ఏ) సూచనల మేరకు తాత్కాలిక మరమ్మతులు చేపట్టారు. బ్యారేజీ దెబ్బతిన్న సమయం నుంచి తొలి సారిగా భారీ వరద ప్రవాహం వచ్చి చేరుతుంది.  బ్యారేజీలో నీటి నిల్వ చేయవద్దని ఎన్డీఎస్ఏ సూచనల మేరకు 85 గేట్లు ఎత్తే ఉంచడంతో వచ్చిన వరద నీరు వచ్చినట్టుగా దిగువకు చేరుతోంది. ప్రస్తుతానికి నీటిని నిల్వ చేసే పరిస్థితులు లేవు. అన్నారం బ్యారేజీకి సైతం వరద ప్రవాహం పెరిగింది. పై నుంచి 16,500 క్యూసెక్కుల ప్రవాహం వస్తూండడంతో 66 గేట్లు ఎత్తి ఉండగా అంతే స్థాయిలో నీటిని దిగువకు వదులుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news