దీపాదాస్ మున్షీపై వేటు..తెలంగాణకు కొత్త ఇన్‌ఛార్జ్‌

-

తెలంగాణ కాంగ్రెస్ కొత్త ఇంచార్జ్ గా మీనాక్షి నటరాజన్ నియామకం అయ్యారు. దీపాదాస్ మున్షీపై వేటు వేసిన కాంగ్రెస్‌ పార్టీ అధిష్టానం… తెలంగాణ కాంగ్రెస్ ఇన్ఛార్జ్గా మీనాక్షి నటరాజన్ ను నియామకం చేసింది. దీంతో దీపాదాస్ మున్షీ స్థానంలో మీనాక్షి నటరాజన్ వచ్చారు. 2009లో మధ్యప్రదేశ్లోని మాండసోర్ నుంచి ఎంపీగా పని చేసిన మీనాక్షి నజరాజన్..ఇప్పుడు తెలంగాణ రాష్ట్రానికి వస్తున్నారు. దీపాదాస్ మున్షీపై తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఫిర్యాదులు చేసినట్లు చెబుతున్నారు.

Meenakshi Natarajan has been appointed as the new in-charge of Telangana Congress

ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంటున్నారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. నాయకుల మధ్య సమన్వయం కుదర్చ లేకపోయారన్న విమర్శలు కూడా దీపాదాస్ మున్షీపై ఉన్నాయట. అయితే.. వీటన్నిటినీ పరిగణలోకి తీసుకున్న కాంగ్రెస్‌ అధిష్టానం… దీపాదాస్ మున్షీపై వేటు వేసింది. ఈ తరుణంలోనే… తెలంగాణ కాంగ్రెస్ కొత్త ఇంచార్జ్ గా మీనాక్షి నటరాజన్ నియామకం అయ్యారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version