వైఎస్సార్టీపీని గురువారం షర్మిల కాంగ్రెస్ లో విలీనం చేశారు. షర్మిల కాంగ్రెస్ లో చేరిక సందర్బంగా వేదికపై తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఎవ్వరూ కూడా కనిపించకపోవడం గమనార్హం. ఏఐసీసీ ఆఫీస్ లోనే సీఎం రేవంత్ రెడ్డి సహా టీ కాంగ్రెస్ నేతలు ఉండిపోయారు. కాంగ్రెస్ వైఎస్సార్టీపీ విలీనానికి టీపీసీసీ నేతలు దూరంగా ఉండటం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. వేదికపై ఏపీసీసీ చీఫ్ రుద్రరాజు సహా సీనియర్ నేతలు మాత్రమే కనిపించారు.
ఇన్ చార్జీ మాణిక్కం ఠాగూర్ నేతృత్వంలోనే విలీనం జరిగింది. ఈ పరిణామంతో షర్మిల ఏపీ రాజకీయాల్లో యాక్టివ్ గా ఉంటారని సంకేతాలు పంపినట్టు అయింది. అయితే ఇటీవలే జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ కి షర్మిల మద్దతు తెలిపారు. కేసీఆర్ వ్యతిరేక ఓట్లు చీలకూడదని బరిలో నుంచి తప్పుకున్నారు. సపోర్ట్ చేసిన షర్మీల పార్టీ విలీనం వేళ టీ కాంగ్రెస్ నేతలు కనిపించకపోవడం తీవ్ర చర్చనీయాంశమైంది.