దీపావళి పండుగ సందర్భంగా హైదరాబాద్ నగరవాసులకు మెట్రో రైలు యాజమాన్యం ఓ విజ్ఞప్తి చేసింది. నగరంలో ట్రాఫిక్ ఇబ్బందుల దృష్ట్యా ఎక్కడికి వెళ్లాలన్న నగరవాసులు మెట్రోనే ఆశ్రయిస్తున్న నేపథ్యంలో, దీపావళి షాపింగ్ చేసే వారిని దృష్టిలో ఉంచుకొని ఓ ప్రకటన జారీ చేసింది. పండుగకు టపాసులు కొనుగోలు చేసి మెట్రోలో ప్రయాణించటంపై నిబంధనలు పెట్టింది.
హైదరాబాద్ మెట్రో రైల్లో ప్రయాణించేటప్పుడు, టపాసులు తీసుకువెళ్లద్దని యజమానం ప్రయాణికులను కోరింది. నిబంధనల ప్రకారం మెట్రో రైల్లో పేలుడు ప్రదార్థాలు తీసుకెళ్లటం నిషేధమని తెలిపింది. ఇలాంటి పదార్థాల వల్ల మెట్రో వ్యవస్థ తో పాటు సిబ్బంది, ప్రయాణికులకు ప్రాణహాని పొంచి ఉందని పేర్కొంది. మూడు రోజుల్లో రానున్న దీపావళి పండుగ దృష్ట్యా ప్రయాణికుల రద్దీ పెరగనుంది.