రాష్ట్రవ్యాప్తంగా రేషన్ డీలర్లు నిరసనకి దిగారు. తమకు గౌరవ వేతనం ప్రకటించాలని డిమాండ్ చేస్తూ రేషన్ డీలర్లు షాపులు బంద్ చేసి ఆందోళనకు దిగారు. ప్రభుత్వం స్పందించే వరకు రేషన్ సరుకులు పంపిణీ చేయబోమని ప్రకటించారు. దీనిపై ప్రభుత్వం వెంటనే స్పందించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. పట్టణాలలో 50 నుండి 60 వేలు.. జిల్లాలో 30 నుండి 40 వేల గౌరవ వేతనం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. లేదంటే క్వింటాల్ కి 250 కమిషన్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.
అయితే రేషన్ డీలర్లు నిరసనకు దిగడంపై తాజాగా స్పందించారు పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్. రేషన్ డీలర్ల మొండివైఖరి సరికాదని హితవు పలికారు. వెంటనే వారు నిరసనలు విరమించి విధులలో చేరాలని సూచించారు. లేదంటే ఐకెపి సెంటర్లు, మహిళా సంఘాల ద్వారా సరుకులు సరఫరా చేయిస్తామని హెచ్చరించారు. మరి మంత్రి హెచ్చరికలతో రేషన్ డీలర్లు ఏ విధంగా స్పందిస్తారో వేచి చూడాలి.