రాజీనామా లేఖతో హరీశ్ డ్రామా.. అయినా ఎవరూ నమ్మట్లే : మంత్రి కోమటిరెడ్డి

-

రుణమాఫీ, ఇతర హామీలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సవాల్ విసిరిన మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు రాజీనామా లేఖ తీసుకుని ఈరోజు ఉదయం గన్పార్క్ అమరవీరుల స్తూపం వద్దకు చేరుకుని మరోసారి రేవంత్కు సవాల్ విసిరారు. సీఎం కూడా తన స్టాఫ్తో రాజీనామా లేఖను పంపించాలని డిమాండ్ చేశారు. ఈ వ్యవహారంపై మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి స్పందించారు. హైదరాబాద్లో మీడియా సమావేశం ఏర్పాటు చేసిన ఆయన హరీశ్ రావుపై తీవ్రంగా మండిపడ్డారు.

‘హరీశ్ రావు రాజీనామా లేఖతో కొత్త డ్రామాకు తెర తీశారు. కానీ ఆయణ్ను ప్రజలు నమ్మే స్థితిలో లేరు. ప్రజలకు బీఆర్ఎస్ నాటకాలు తెలిసిపోయే.. అసెంబ్లీ ఎన్నికల్లో బుద్ధిచెప్పారు. మా ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం ఆగస్టు 15న రుణమాఫీ చేసి తీరుతుంది. ఎమ్మెల్యే పదవి వదులుకునేందుకు హరీశ్‌రావు భయపడుతున్నారు. గతంలో నేను మంత్రి పదవిని తృణప్రాయంగా వదులుకున్నాను. మెదక్‌లో బీఆర్ఎస్ కనీసం డిపాజిట్‌ దక్కించుకోవాలి. సీఎంకు సవాల్‌ విసిరిన అని గొప్పలు చెప్పుకుంటున్నారు. కాంగ్రెస్‌ను విమర్శించడం బీఆర్ఎస్ నేతలు మానుకోవాలి’ అని కోమటిరెడ్డి అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news