తెలంగాణ ఏర్పాటులో జైపాల్‌రెడ్డిది కీలకపాత్ర: మంత్రి కోమటిరెడ్డి

-

తెలంగాణ ఏర్పాటుకు నాటి ప్రధాన మంత్రి మన్మోహన్‌ సింగ్‌, కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియా గాంధీని ఒప్పించడంలో కేంద్ర మాజీ మంత్రి ఎస్‌. జైపాల్‌ రెడ్డి కీలక పాత్ర పోషించారని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. హైదరాబాద్ నెక్లెస్‌రోడ్‌లోని స్ఫూర్తి స్థల్‌ వద్ద జైపాల్‌ రెడ్డి జయంతి కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డితో పాటు పాల్గొన్న మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, జూపల్లి కృష్ణారావు, పలువురు కాంగ్రెస్‌ నేతలు జైపాల్ రెడ్డికి నివాళులు అర్పించారు.

అనంతరం మంత్రి కోమటిరెడ్డి మీడియాతో మాట్లాడారు. తెలంగాణ తప్పకుండా వస్తుందని ఎవరూ ఆత్మహత్యలకు పాల్పడవద్దని నాయకులు, ఉద్యమకారులకు జైపాల్‌ రెడ్డి చెప్పేవారని ఆయన గుర్తు చేసుకున్నారు. హైదరాబాద్‌ కేంద్ర పాలిత ప్రాంతం కాబోదని భరోసా ఇచ్చారని తెలిపారు. తన రాజకీయ జీవితంలో ఏనాడూ ప్రతిపక్షాలు వేలెత్తి చూపకుండా జైపాల్ రెడ్డి పని చేశారని కొనియాడారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు ఆయన పేరు పెట్టే విషయంపై ముఖ్యమంత్రితో చర్చించి నిర్ణయం తీసుకుంటాం అని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news