అలా జరిగితే రాజకీయాల్లో కొనసాగడమే వేస్ట్.. కోమటిరెడ్డి సంచలన వ్యాఖ్యలు

-

హైదరాబాద్ నగరంలో ఇప్పుడు ఎక్కడ చూసినా మూసీ ప్రక్షాళన పై చర్చించుకుంటున్న విషయం అందరికీ తెలిసిందే. మూసీ ప్రక్షాళన పై ప్రజల్లో ప్రతిపక్షాలు సృష్టిస్తున్న గందరగోళానికి తెరదించాల్సిన అవసరం ఉందని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పేర్కొన్నారు. నవంబర్ 08న సీఎం రేవంత్ రెడ్డి యాదాద్రి పర్యటనకు వస్తున్న సందర్భంగా యాదాద్రి భువనగిరి జిల్లా ప్రజాప్రతినిధులతో హైదరాబాద్ లోని ఆయన నివాసంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి కోమటిరెడ్డి మాట్లాడుతూ.. దశాబ్దాలుగా ఉమ్మడి నల్గొండ జిల్లా ప్రజల కాళ్లు, చేతులు వంకర్లు పోయి క్యాన్సర్ వంటి జబ్బులతో చచ్చిపోతుంటే.. ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వం కనీసం పట్టించుకున్న పాపాన పోలేదని ఆగ్రహం వ్యక్తం చేసారు. 

కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన పది నెలల్లోనే కోట్లాది మంది మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించామన్నారు. రూ.500లకే గ్యాస్ సిలిండర్లు, ఆరోగ్య శ్రీని రూ.10లక్షలకరు పెంచామని, లక్షలాది గృహాలకు ఉచిత విద్యుత్ అందిస్తున్నామని.. 22 లక్షల మంది రైతులకు రూ.2లక్షల వరకు రుణమాఫీ చేశామని తెలిపారు. దేశంలో ఎక్కడ లేని విధంగా స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేసి లక్షలాది మందిని నైపుణ్యవంతులుగా చేసేందకు ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు. అందరూ కలిసి కట్టుగా పోరాడకపోతే మూసీ మురికి కుంపంగా మరింత పీడిస్తుందని.. అలా జరిగితే రాజకీయాల్లో కొనసాగడం వేస్ట్ అన్నారు. 

Read more RELATED
Recommended to you

Latest news