ఉచిత బస్సు పథకం మహిళల సరదాలకు ఉపయోగపడుతుందంటూ అనుచిత వ్యాఖ్యలు చేసిన కేటీఆర్ కు కౌంటర్ ఇచ్చారు తెలంగాణ రాష్ట్ర దేవాదాయ, అటవీ,పర్యావరణ మంత్రి కొండా సురేఖ. నీకు చిత్తశుద్ధి లేకుండా తెలంగాణ ఆడబిడ్డలను అవమానపరిచావు. ఉచిత బస్సు ప్రయాణం లో ఎంతో మంది మహిళలు వాళ్ళ ఆత్మ గౌరవాన్ని నిలుపుకునే విధంగా ఆ సౌకర్యాన్ని వాడుకుంటున్నారు. అత్తవారింటి నుండి తల్లి గారి ఇంటికి వెళ్లాలంటే ఒకరి వద్ద చేయి చాపకుండా ప్రభుత్వం మహిళకు హక్కుగా ఏర్పాటు చేసిన ప్రభుత్వ బస్సులో హుందాగా ఈరోజు ప్రయాణం చేస్తున్నారు.
ఆరోగ్యపరమైన సమస్యలు ఏదైనా వస్తే హైదరాబాద్ లాంటి మహానగరాలకు కూడా తన తోటి చెల్లినో అక్కనో స్నేహితురాలనో తీసుకొని వెళ్లి ఎవరిపైన ఆధారపడకుండా ఆసుపత్రిలో ఆరోగ్యశ్రీ కార్డుతో వైద్యం చేయించుకొని తిరిగి అదే బస్సులో ప్రయాణమై క్షేమంగా ఇంటికి చేరుకుంటున్న పరిస్థితి నేడు తెలంగాణ మహిళలకు కాంగ్రెస్ ప్రభుత్వం కల్పించింది. క్లబ్బుల్లో పబ్బుల్లో కార్యకలాపాలు సాగించుకునేది నువ్వు నీ కుటుంబం. తెలంగాణ మహిళల పట్ల ఇంకెప్పుడైనా నోరు జారితే తెలంగాణ నుండి నిన్ను తరిమి కొట్టే బాధ్యత ఈ మహిళలే తీసుకుంటారు అంటూ ఘాటు విమర్శలు చేసారు మంత్రి సురేఖ..