మోడీ నల్లధనం తెస్తానని తెల్లముఖం వేశాడు – మంత్రి కేటీఆర్

-

నేడు కామారెడ్డిలో పర్యటిస్తున్నారు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్. ఈ పర్యటనలో భాగంగా పలు అభివృద్ధి కార్యక్రమాలని ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ పాలనలో కరెంటు ఉంటే వార్త, కేసీఆర్ పాలనలో కరెంటు పోతే వార్త అవుతుందన్నారు. బిచ్కుంద, పిట్లం మండలాలను మున్సిపాలిటీగా మారుస్తామని హామీ ఇచ్చారు మంత్రి కేటీఆర్.

తెలంగాణకు అన్యాయం జరిగిందంటూ రేవంత్ రెడ్డి గొంతు చించుకుంటున్నాడని.. 10 సార్లు అవకాశాలు ఇస్తే 50 ఏళ్ళు పాలించి ఎం చేశారు..? అని ప్రశ్నించారు. పరిపాలించడం చేతగాని వారు ఇపుడు ఒక్క చాన్స్ ఇవ్వమని అడుగుతున్నారని ఎద్దేవా చేశారు. అబద్ధాలు చెప్పడంలో మోడీ కి ఆస్కార్ అవార్డు ఇవ్వాలని, మోడీ మహానటుడు అని ఎద్దేవా చేశారు మంత్రి కేటీఆర్. దేశ సంపద అంతా దోస్తు ఖాతాలో జమచేస్తూ విపక్షాలను కొనుగోలు చేస్తున్నాడని ఆరోపించారు. 2 కోట్ల ఉద్యోగాలు ఏమయ్యాయని ప్రశ్నించారు. నల్లధం తెస్తానని.. ఇపుడు తెల్లమొఖం వేశాడన్నారు కేటీఆర్. వచ్చే ఎన్నికల్లో బీజేపీ కి డిపాజిట్ గల్లంతు చేయాలన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news