తెలంగాణలోని తాండూరు వ్యవహారం మంత్రి కేటీఆర్ వరకు చేరింది.తాండూరు ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి..మంత్రి కేటీఆర్ తో భేటీ అయ్యారు.మహేందర్ రెడ్డి వ్యవహారాన్ని ఆయన కేటీఆర్ కు వివరించినట్లు తెలుస్తోంది.ఘటనపై కేటీఆర్ సీరియస్ గా ఉన్నట్టు సమాచారం.అక్కడి పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు.ఈ వ్యవహారంపై అధిష్టానం గుర్రుగా ఉన్నట్టు తెలుస్తోంది.ఇటు ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి ని అధిష్టానం పిలిచినట్టు సమాచారం.మరికాసేపట్లో ఆయన కూడా కేటీఆర్ తో సమావేశం అయ్యే అవకాశం ఉంది.
ఓ గుడిలో కార్యక్రమానికి సంబంధించి రోహిత్ రెడ్డి, మహేందర్ రెడ్డిలు హాజరు కాగా…తనను కాదని ఎమ్మెల్యే అనుచరులకు కార్పెట్ వేశారు అంటూ తాండూర్ సీఐ పై మహేందర్ రెడ్డి బూతు పురాణం అందుకున్నారు అంటూ ఓ ఆడియో వైరల్ ఐన సంగతి తెలిసిందే.దీనిపై మహేందర్ రెడ్డి స్పందిస్తూ, ఆ ఆడియో తనది కాదని అన్నారు.ఇసుక దందాఇసుక దందాలోో రోహిత్ రెడ్డి, సీఐ కి ప్రమేయం ఉందని ఆయన ఆరోపణలు చేశారు.