తెలంగాణ రాష్ట్రంలో అతిపెద్ద ప్రాజెక్ట్ అయిన మల్లన్న సాగర్ ప్రాజెక్ట్‌ను సీఎం కేసీఆర్ ప్రారంభించి జాతికి అంకితం చేశారు. ఈ కార్యక్రమానికి మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు, పలువురు ఎమ్మెల్యేలు హాజరయ్యారు. తెలంగాణ రాష్ట్రానికి రూపాయి సాయం చేయని కేంద్రంపై రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా పంచ్‌లు వేశారు. కేంద్రం నుంచి రాష్ట్రానికీ జాతీయ హోదా ఉండదు.
పోని ఆర్థిక సాయం అయినా ఉంటుందా..? అది కూడా లేదు. అయినప్పటికీ ఇండియాలోనే యంగెస్ట్ స్టేట్ అయినా తెలంగాణ మాత్రం.. ప్రపంచంలోనే అతిపెద్దదైన లిప్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును రికార్డు సమయంలోనే నిర్మించామని కేటీఆర్ పేర్కొన్నారు. సీఎం కేసీఆర్‌కు తెలంగాణ ప్రజల మీద ప్రేమ ఉంది కాబట్టి సవాళ్లను అధిగమించి అభివృద్ధికి తోడ్పాడుతున్నారని కేటీఆర్ తెలిపారు. తెలంగానపై కేసీఆర్ ప్రేమకు ఏది సాటి రాదని చెప్పారు.