మంత్రి మల్లారెడ్డి పనిమనిషికి ఫిట్స్.. ఆసుపత్రికి తరలింపు

-

మంత్రి మల్లారెడ్డి ఇంట్లో, అలాగే ఆయన బంధువుల ఇళ్లలో రెండవ రోజు కూడా ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ ఐటి రైడ్స్ ఘటనలో ఊహించని ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. మంత్రి మల్లారెడ్డి పెద్ద కుమారుడు మహేందర్ రెడ్డి, చిన్న కుమారుడు భద్రారెడ్డి, అల్లుడు రాజశేఖర్ రెడ్డి, బంధువుల ఇళ్లలో కూడా తనిఖీలు నిర్వహిస్తున్నారు ఐటీ అధికారులు.

mallareddy
mallareddy

ఈ నేపథ్యంలో నేడు ఉదయం ఆయన పెద్ద కుమారుడు మహేందర్ రెడ్డి అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే. ఇక ఆయన మరదలు కొడుకు ప్రవీణ్ రెడ్డి కూడా అస్వస్థతతో ఆసుపత్రిలో చేరగా.. మల్లారెడ్డి ఆసుపత్రికి వెళ్లి పరామర్శించి వచ్చారు. తాజాగా మల్లారెడ్డి ఇంట్లో పని చేసే రమణకు ఫిట్స్ వచ్చింది. దీంతో ఆయనని వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఇక ఐటీ అధికారులు మంత్రి మల్లారెడ్డికి నోటీసులు ఇవ్వనున్నట్లు సమాచారం.

Read more RELATED
Recommended to you

Latest news