గెటప్ శ్రీను ఈ పోగుడుడు ఏంది బాబు..!!

-

గెటప్ శ్రీను బుల్లి తెర నుండి సినిమాలకు వచ్చి హంగామా చేస్తున్న సంగతి తెలిసిందే. తాను జబర్థస్త్ షో, ఎక్స్ట్రా జబర్థస్త్ షోస్ ద్వారా పేరు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం చాలా సినిమాల్లో నటిస్తూ ఉన్నాడు. ప్రస్తుతం తాను ఒక ఈవెంట్ లో చేసిన కామెంట్స్ తనపై విమర్శలు కురిపించేలా చేసాయి.

తేజ సజ్జ హీరోగా, ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో వస్తున్న సినిమా హనుమాన్. ఈ సినిమా టీజర్ ను రీసెంట్ గా విడుదల చేశారు.ఇక ఈ టీజర్ రిలీజ్ ఈవెంట్ లో ఆ సినిమాలో నటించిన  గెటప్ శ్రీను మాట్లాడుతూ  డైరెక్టర్ ప్రశాంత్ వర్మ ను  మరో రాజమౌళి అంటూ పొగిడేశాడు. దీని పైనే ప్రస్తుతం విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

తాను ప్రశాంత్ వర్మని ఎంత పోగుడుకున్న గాని ఇబ్బంది ఉండేది కాదు గాని తాను ప్రశాంత్ వర్మ రాజమౌళి తో పోల్చే సరికి రాజమౌళి అభిమానులకు మండిపోయెలా చేసింది. ఎన్నో సినిమాల కష్టం తో తెలుగు సినిమా ను ప్రపంచస్థాయిలో నిలబెట్టిన రాజమౌళి ఎక్కడ ఏదో రెండు సినిమాలు తీసిన ప్రశాంత్ వర్మ ఎక్కడ అని సోషల్ మీడియాలో కామెంట్స్ తో విరుచుకు పడ్డారు. కొన్ని సినిమాల్లో నటించే సరికి నీకు బాగా పెరిగిపోయింది అని మరి కొంత మంది విమర్శలు చేస్తున్నారు.

 

Read more RELATED
Recommended to you

Latest news