ఇసుకను దోచిన వారే ఆరోపణలు చేయడం విడ్డూరం : మంత్రి పెద్ది రెడ్డి

-

టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు పై ఏపీ మైనింగ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఫైర్ అయ్యారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు నాయుడుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యంగా ఇసుక మాఫియా పై విరుచుకుపడ్డారు. ఇసుకను దోచిన వారే ఆరోపణలు చేయటం విడ్డూరంగా ఉందన్నారు.

 

ఈ శాఖను సక్రమంగా నిర్వహించటం వల్లనే ఆదాయాలు పెంచగలిగామని వెల్లడించారు మైనింగ్ శాఖా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. ఉచితం అని చెప్పి ప్రజలకు సున్నం పెట్టింది ఎవరు?? అని నిలదీశారు. ఎమ్మార్వో వనజాక్షి అక్రమ ఇసుక రవాణాను అడ్డుకుంటే చంద్రబాబు ఏం చేశాడన్నారు. అప్పట్లో లోకేష్ కు ప్రతి నెల 500 కోట్లు ముట్టేవని ఆరోపణలు ఉన్నాయని వెల్లడించారు మైనింగ్ శాఖా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. చంద్రబాబు ప్రభుత్వంలో ఎన్జీటీనే 100 కోట్ల జరిమానా విధించిందని.. కరకట్ట ఇసుక తవ్వకాల పై పెనాల్టీ వేసింది వాస్తవం కాదా అని ప్రశ్నించారు మైనింగ్ శాఖా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.

Read more RELATED
Recommended to you

Latest news