టీటీడీ వంటి హిందూ దేవాలయాల ట్రస్ట్ బోర్డుల్లో అన్యమతస్తులను నియమిస్తున్నారని ఏపీ బీజేపీ చీఫ్ దగ్గుబాటి పురంధేశ్వరి మండిపడ్డారు. హిందువుల మనోభావాలు దెబ్బతిన్న పట్టించుకోవడం లేదన్నారు. గురువారం విజయవాడలో బీజేపీ ఆధ్వర్యంలో శంఖానాదం కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. బీజేపీ సోషల్ మీడియా, ఐటీ ప్రతినిధులకు వర్క్ షాపు నిర్వహించారు. ఈ సందర్భంగా పురంధేశ్వరి మాట్లాడుతూ.. పేదల కోసం కేంద్ర గ్యాస్ రూ.200 తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంటే.. దానిని రాజకీయమనడం తగదన్నారు. రాష్ట్రపతి భవన్ లో జరిగిన ఎన్టీఆర్ స్మారక నాణెం విడుదల కార్యక్రమానికి కుటుంబం అంతా వెళ్లి హాజరయ్యామని తెలిపారు. కుటుంబమంతా వెళ్లి ఎన్టీఆర్ స్మారక నాణెం విడుదలలో పాల్గొంటే తప్పుపడతారా ? అని ప్రశ్నించారు.
రాష్ట్రపతి భవన్ లో జరిగిన కార్యక్రమంపై సజ్జల చేసిన వ్యాఖ్యలు సరికాదన్నారు. రాష్ట్రపతి పాల్గొన్న కార్యక్రమాన్ని రాజకీయం చేయడం తగదన్నారు. రాష్ట్రపతి భవన్ కి రాజకీయ రంగు పులిమారాని మండిపడ్డారు. సజ్జల, విజయసాయిరెడ్డి వ్యాఖ్యలపై తాను స్పందించనను అని పేర్కొన్నారు. ముఖ్యంగా ఎన్టీఆర్ స్మారక నాణెం విడుదలపై ఎవరెవ్వరో ఏదేదో మాట్లాడుతారని.. వాటిని తాను సమాధానం చెప్పాల్సిన అవసరం లేదన్నారు.