ఈడీ, ఐటీ దాడులపై తొలిసారి స్పందించిన మంత్రి పొంగులేటి..!

-

తన పై, తన కుటుంబ సభ్యులపై ఇటీవల జరిగిన ఈడీ, ఐటీ దాడులపై మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తొలిసారి స్పందించారు. బీఆర్ఎస్, బీజేపీ మంచి దోస్త్ అని.. తన ఇంట్లో జరిగిన రెయిడ్స్ కి సంబంధించిన డేటాను బీజేపీ ని అడిగి బీఆర్ఎస్ రిలీజ్ చేసుకోవాలన్నారు. ఖమ్మం జిల్లాలో పర్యటించిన మంత్రి పొంగులేటి ఓ మీడియా ప్రతినిధితో మాట్లాడుతూ.. బీఆర్ఎస్, బీజేపీ మాటలు వింటుంటే.. నవ్వు వస్తుందన్నారు. బీఆర్ఎస్ గడిచిన పదేళ్లుగా ప్రజలతో ఉన్న సంబంధాలను కోల్పోయిందని ధ్వజమెత్తారు.

పదేళ్లు అధికారంలో ఉన్న కేటీఆర్ ప్రజల వద్దకు పోకుండా.. ఇప్పుడు అధికారం కోసం పాదయాత్ర చేస్తున్నారని మండిపడ్డారు. ఈ పాదయాత్రకైనా కనీసం ప్రజల కోసం చేస్తే.. బాగుంటుందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్నో.. సీఎం, మంత్రులు, ఎమ్మెల్యేలను టార్గెట్ చేయడానికో వస్తే.. అది కేటీఆర్ తెలివితక్కువ తనం అవుతుందన్నారు. బీఆర్ఎస్ గత పదేళ్లు ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని పేర్కొన్నారు. రాహుల్ గాంధీ చెప్పినట్టుగా ఈ దేశానికి రోల్ మోడల్ గా తెలంగాణలో కులగణన చేస్తున్నామన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news