తెలంగాణ రెవెన్యూ శాఖ మంత్రి నివాసంతో పాటు పలు చోట్ల ఈడీ దాడులు చేస్తున్న విషయం తెలిసిందే. ఇవాళ ఉదయం నుంచి ఈ దాడులు కొనసాగుతున్నాయి. గతంలో కూడా మంత్రి పొంగులేటి నివాసం పై ఈడీ దాడులు జరిగాయి. ఈసారి రాష్ట్ర ఈడీ కార్యాలయానికి కానీ పోలీసులకు కానీ ఎలాంటి సమాచారం లేకుండా నేరుగా ఢిల్లీ నుంచి వచ్చిన ఈడీ అధికారులు సోదాలు జరుపుతున్నారు.
సీఆర్పీఎఫ్ బలగాలతో ఈ సోదాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా ఈడీ అధికారులు ఓ కీలక ప్రకటన విడుదల చేశారు. తెలంగాణాలోని రెవెన్యూ శాఖా మంత్రి పొంగులేటి కుమారుడి ఇళ్లు, కార్యాలయాల్లో సోదాలు చేస్తున్నామని తెలిపారు. రూ.5 కోట్ల విలువైన 7 వాచ్‌లు కొనుగోలు చేసినట్లు గుర్తించామని..
క్రిప్టో హవాలా ద్వారా వాచ్‌లు కొనుగోలు చేసినట్లు తెలిసింది. అందుకే 5 ప్రాంతాల్లో సోదాలు చేస్తున్నామని తెలిపారు ఈడీ అధికారులు. మరికొద్ది సేపట్లోనే పూర్తి వివరాలు వెల్లడిస్తామని చెప్పారు ఈడీ అధికారులు.