నారాయణ కళాశాలలకు మహిళా కమిషన్ నోటీసుల జారీ చేసింది. విద్యార్థినుల వరుస ఆత్మహత్యలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇటీవలే హైదరాబాద్ బాచుపల్లి నారాయణ కాలేజీలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న అనూష(16) అనే విద్యార్థిని ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఆ ఘటన మరువక ముందే మాదాపూర్ నారాయణ కాలేజీలో మరో విద్యార్థిని ఫ్యాన్ కి ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది.
ముఖ్యంగా శ్రీ చైతన్య, నారాయణ వంటి కార్పొరేట్ కళాశాలలోనే ఇలాంటి ఘటనలు చోటు చేసుకోవడంతో ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. అలాగే కొందరూ పేరెంట్స్ కూడా ఇక నుంచి తమ పిల్లలను శ్రీచైతన్య, నారాయణ వంటి కార్పొరేట్ కళాశాలల్లో చేర్పించకూడదని పేర్కొంటున్నట్టు సమాచారం. ఇక విద్యార్థులు ఆత్మహత్య చేసుకోవడం పై మహిళా కమిషన్ సైతం ఆగ్రహం వ్యక్తం చేస్తూ సీరియస్ అయింది. అసలు ఎందుకు విద్యార్థులు బలవన్మరణాలకు పాల్పడుతున్నారో వివరణ ఇవ్వాలని తెలంగాణ మహిళా కమిషన్ నారాయణ కాలేజీలకు నోటీసులు ఇచ్చింది.