సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం మీర్జాపూర్ లోని ఆర్కే జన్నింగ్ మిల్లులో పత్తి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు మంత్రి పొన్నం ప్రభాకర్. అనంతరం ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో పత్తి కొనుగోలు కేంద్రాలు ప్రారంభం కాక రైతులు ఇబ్బందులు పడుతున్న విషయం కొన్ని పత్రికల్లో వచ్చింది. కాబట్టి రాష్ట్రంలో సిసిఐ ఆధ్వర్యంలో ఉన్న 322 పత్తి కొనుగోలు కేంద్రాలను తొందరగా ప్రారంభించేలా చొరవ తీసుకోవాలని రాష్ట్రంలోని కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ కి విజ్ఞప్తి చేస్తున్న.
పత్తి కొనుగోలు చేసే బాధ్యత కేంద్ర ప్రభుత్వాన్ని, కొనుగోలు కేంద్రాలలో సౌకర్యాలు ఏర్పాటు చేసే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిది. 8% తేమ లోపల ఉన్న పత్తికి 7,500 రూపాయల కనీస మద్దతు ధర పలుకుతోంది, రైతులు సద్వినియోగం చేసుకోవాలి. రాష్ట్రంలో 100% డిఫాల్ట్ ఉన్న మిల్లర్లకు ధాన్యం కేటాయించేది లేదు. ధాన్యం కొనుగోలు కేంద్రాలలో నిబంధనలకు అనుగుణంగా ధాన్యం కొనుగోలు చేయకుంటే తనకు ఎస్ఎంఎస్ చేస్తే స్పందిస్తాను. సన్నపు రకం వరి ధాన్యానికి ప్రభుత్వం తరపున 500 రూపాయల బోనస్ తప్పకుండా ఇస్తాం అని మంత్రి పొన్నం తెలిపారు.