మహిళలను BRS ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది : భట్టి విక్రమార్క

-

మహిళలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు ఇందిరా డైరీ నీ రూపొందించాం. మహిళా డైరీలో పాల విక్రయాలు, వెన్న పాల ఉత్పత్తి ద్వారా స్వయం సమృద్ధి జరుగుతుంది అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. మహిళా డైరీ పై బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది. మహిళలు, మహిళ పాల ఉత్పత్తులు మహిళ రుణాల పట్ల BRS ప్రభుత్వం పట్టించుకోలేదు. మహిళలను BRS ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది.

మహిళా డైరీ పై BRS ప్రభుత్వం దుష్ప్రచారం చేసింది. మహిళా డైరీ పట్ల వ్యవహరించిన వైఖరి సరియనది కాదు. ఈ డైరీ లో 61 వేల మంది సభ్యుల తో 40 లక్షలు డిపాజిట్స్ వున్నాయి. ఇందిరమ్మ రాజ్యం రాగానే మహిళ డైరీ పై దృష్టి సారించాను. మధిర నియోజకవర్గం లో రెండున్నర లక్షల లీటర్ల పాలు తయారీ చేయవచ్చు. ఏడాది లో మహిళల ఆదాయం నెలకి 24 కోట్లు రూపాయలు పాలా మీదనే మహిళలు సంపాదించవచ్చు. పాల ఉత్పత్తుల న్నింటిని కలిపితే 500 కోట్లు సంపాదించవచ్చు. ఇందిరా డైరీ ద్వారా దేశం మొత్తం మధిర వైపే చూడాలి అని డిప్యూటీ సీఎం పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news