ఉమ్మడి కరీంనగర్ జిల్లా అభివృధిపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు, మంత్రి పొన్నం ప్రభాకర్ కలిసి ఉన్నతాధికారులతో సమావేశం ఏర్పాటు చేసారు. ఇందులో భాగంగా మంత్రి పొన్నం మాట్లాడుతూ.. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఉన్న గురుకుల పాఠశాలలో కలెక్టర్ల తో పాటు ఉన్నతాధికారులు సందర్శించి నాణ్యమైన భోజనం అందేలా చూడాలి. మెస్ చార్జీలను గ్రీన్ ఛానల్ ద్వారా అందిస్తున్నామన్నారు. ధాన్యం సేకరణ సజావుగా జరుగుతుందని, రైస్ మిల్లర్లు కూడా ప్రభుత్వ పాలసీ అనుసరిస్తూ సహకారం అందిస్తున్నారన్నారు.
ఇక గౌరవెల్లి గండేపల్లి ప్రాజెక్టులను లింక్ చేసి సమాంతరంగా నిర్మాణ పనులు చేపట్టాలన్నారు. గౌరవెల్లి ప్రాజెక్టుకు సంబంధించి బండ్ నిర్మాణం చివరి దశలో ఉందని, కాలువల పనులకు అవసరమైన భూసేకరణ పూర్తి చేయాలని, భూ సేకరణ పై ఎటువంటి కోర్టు నిబంధనల లేనందున ముందుగా ఈ ప్రక్రియ పూర్తి చేయాలన్నారు. అయితే ఈ సమావేశంలో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ఎమ్మెల్యేలు చింతకుంట విజయ రమణారావుతో పాటు తదితరులు పాల్గొన్నారు.