గచ్చిబౌలిలో కన్నడ బుల్లితెర నటి సూసైడ్..!

-

కన్నడ బుల్లితెర నటి గచ్చిబౌలిలో సూసైడ్ చేసుకుంది. కన్నడలో చాలా సీరియల్లో నటించిన యాంకర్ శోభిత శ్రీరాం నగర్ కాలనీ సిబ్లాక్ లో ఇంట్లో ఫ్యాన్ కు ఊరివేసుకోని ఆత్మహత్య చేసుకుంది. అయితే భర్తతో కలిసి గచ్చిబౌలిలో నివాసం ఉంటుంది శోభిత. ఆమె భర్త సాఫ్ట్వేర్ ఇంజనీర్. అయితే శోభిత మృతి పై కుటుంబ సభ్యులు ఎటువంటి కారణాలు వెల్లడించలేదు. శోభిత మృతి దేహంను పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా హాస్పిటల్ కు తరలించారు పోలీసులు.

అయితే బ్రహ్మగంతు, నీనిదలేలో సీరియల్స్ లో నటించిన శోభిత.. రెండు ఒండ్ల మూడు, ఏటీఎం, ఒక్క కథే కెల్తా, జాక్‌పాట్, అపార్ట్‌మెంట్ టు మర్డర్, వందన వంటి సినిమాల్లో కూడా కనిపించింది. ఈ మధ్యే తెలుగు చిత్ర పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చిన శోభిత గతేడాది పెళ్లి చేసుకుంది. అయితే పెళ్ళి తర్వాత సినిమాలకి, సీరియల్స్ కి దూరంగా ఉంటుంది శోభిత. ఇక ప్రస్తుతం శోభిత ఆత్మహత్యపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు గచ్చిబౌలి పోలీసులు.

Read more RELATED
Recommended to you

Latest news