గాంధీ భవన్ లో పిసిసి కల్లు గీతా కార్మిక విభాగం ఆధ్వర్యంలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 374వ జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ క్రమంలో గాంధీ భవన్ లో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి మంత్రి పొన్నం ప్రభాకర్. అనంతరం ఆయన మాట్లాడుతూ.. సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 374 వ జయంతి సందర్భంగా తెలంగాణ లో బడుగు బలహీనవర్గాలకు ఆలోచింప చేసే దినం.
ఆనాడు రాజ్యాధికారం కోసం వారి పోరాటాన్ని బడుగులను ఐక్యం చేసుకొని ప్రత్యేక సైన్యాన్ని ఏర్పాటు చేసుకొని గోల్కొండ కోట జయించిన సర్దార్ సర్వాయి పాపన్న నేటి తరానికి ఆదర్శం. అందరూ ఆయన జీవిత చరిత్ర తెలుసుకోవాలి. బడుగు బలహీనవర్గాల ఐక్యత కోసం ఆనాడు సైన్యం తో పోరాటం చేసే పరిస్థితి.. ఈరోజు ప్రజాస్వామ్య పద్ధతిలో పెన్ను ద్వారా పోరాటం,ఓటు ద్వారా ప్రజాస్వామ్య పద్ధతిలో ముందుకు సాగాలి. వారు అందరికీ ఆరాధ్యంగా వారు పోరాడిన విధానం మార్గదర్శకత్వం తీసుకోవాలి అని మంత్రి పొన్నం పేర్కొన్నారు.