రైతుల రుణమాఫీ కోసం భూములు విక్రయిస్తున్నాం: ప్రశాంత్‌ రెడ్డి

-

ఇటీవల హైదరాబాద్​లో భూములు హాట్ కేకుల్లా అమ్ముడు పోతున్న విషయం తెలిసిందే. కోకాపేట, బుద్వేల్​లో భూముల ధరలు ఆకాశాన్నంటాయి. ప్రభుత్వ భూముల ఈ-వేలానికి భారీ స్పందన వస్తోంది. అయితే భూముల విక్రయంపై ప్రతిపక్షాలు.. అధికార పార్టీపై మండిపడుతున్నాయి. ప్రజల భూములు అమ్మి సొమ్ము చేసుకుంటున్నారని ప్రభుత్వంపై ఆరోపణలు చేశాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ప్రతిపక్షాల ఆరోపణలపై స్పందించారు.

రైతుల ఇచ్చిన రుణాన్ని మాఫీ చేయడానికి హైదరాబాద్‌లో ఖాళీగా ఉన్న భూములను అమ్ముతున్నామని.. వచ్చిన డబ్బుతో రైతులకు రుణమాఫీ చేస్తున్నామని మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నిజామాబాద్‌ జిల్లా బాల్కొండ నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులను ఆయన శంకుస్థాపన చేశారు. ఈ భూముల విక్రయాలపై కూడా ప్రతిపక్షాలు రాజకీయాలు చేస్తున్నాయని ఆయన ఆరోపించారు. ఎవరేన్ని కుయూక్తులు పన్నినా రుణమాఫీ ఆపేదే లేదని తేల్చి చెప్పారు. ముఖ్య మంత్రి కర్షకులకు ఇచ్చిన మాటకు తాము కట్టుబడి ఉంటామని వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Latest news