జగన్ ముందస్తు విజయం..ఇంకా మేలుకొని బాబు-పవన్.!

-

ఏపీలో మళ్ళీ అధికారంలోకి వచ్చేది జగనే…అందులో ఎలాంటి డౌట్ లేదని ప్రతి సర్వే చెబుతోంది. పోనీ కొన్ని సర్వేలు చెబుతుంటే..అవి వైసీపీ పెయిడ్ సర్వేలు అనుకోవచ్చు. కానీ ప్రతి సర్వేలో వైసీపీ ప్రభంజనం కనబడుతోంది. ఇటీవల జాతీయ సర్వేల్లో వైసీపీ జోరు స్పష్టంగా కనిపిస్తోంది. తాజాగా టైమ్స్ నౌ సర్వే సైతం వైసీపీకి 24-25 ఎంపీ సీట్లు వస్తాయని తేల్చి చెప్పింది.

అంటే దాదాపు క్లీన్ స్వీప్ చేస్తున్నట్లే..అలా చూసుకుంటే అసెంబ్లీ సీట్లు ఎన్ని గెలుస్తుందో ఊహించుకోవచ్చు. మళ్ళీ 150 పైనే గెలుచుకునే ఛాన్స్ ఉంది. అయితే ఇదంతా వైసీపీ పెయిడ్ సర్వే అని టి‌డి‌పి వర్గాలు అంటున్నాయి. అలాంటప్పుడు వేరే జాతీయ మీడియా సంస్థలు సైతం వైసీపీకే ఆధిక్యం ఇస్తున్నాయి. దీని బట్టి చూస్తే ఏపీ ప్రజలు మళ్ళీ జగన్‌నే గెలిపించడానికి రెడీగా ఉన్నారని అర్ధమవుతుంది. అందులో ఎలాంటి డౌట్ లేదు. అయితే జగన్‌ని ఎలా ఓడించాలి..ప్రజల మద్ధతు ఎలా పొందాలనే అంశాలని వదిలేసి..టి‌డి‌పి-జనసేనలు ఎంతసేపు వైసీపీ ఫేక్ సర్వేలు అంటూ గోల పెడుతున్నాయి.

ఇలా గోల పెట్టడం వల్ల చంద్రబాబు-పవన్‌కు ఒరిగేది ఏమి లేదు. పైగా ఈ ఇద్దరు ప్రజల్లో తిరుగుతూ జగన్ ఫ్యామిలీ గురించి పదే పదే కామెంట్లు చేస్తున్నారు. మాటకు మెదిలితే బాబాయి గొడ్డలిపోటు అని, చెల్లిని, తల్లిని తరిమేశారని మాట్లాడుతున్నారు. ఇలా మాట్లాడటం వల్ల బాబు, పవన్‌కే నెగిటివ్ అవుతుంది.

ఫ్యామిలీ పరమైన అంశాల వల్ల ఉపయోగం ఉండదు. పదే పదే అవే విమర్శలతో ప్రజలు విసిగెత్తిపోయి ఉన్నారు. కాబట్టి బాబు, పవన్ లపై నెగిటివ్ పెరుగుతుందే తప్ప తగ్గదు. ఒకవేళ వారిద్దరు కలిసి పోటీ చేసిన జగన్‌ని ఓడించడం కష్టమనే పరిస్తితి కనబడుతోంది.

Read more RELATED
Recommended to you

Latest news