మీ వేధింపులు తట్టుకోలేకే ప్రజలు మాకు పట్టం కట్టారు: మంత్రి సీతక్క

-

శాసనసభ సమావేశాల్లో ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చ జరుగుతోంది. ఈ సందర్భంగా చర్చ మొదలుపెట్టిన మాజీ మంత్రి కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై ఫైర్ అవుతున్నారు. ఆరు గ్యారంటీల అమలుపై ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు. ఈ క్రమంలో కేటీఆర్ వ్యాఖ్యలపై మంత్రి సీతక్క ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయనకు కౌంటర్ ఇస్తూ.. ఇంటింటికీ ఉద్యోగం పేరుతో పదేళ్ల పాటు బీఆర్ఎస్ ప్రభుత్వం మోసం చేసిందని విమర్శించారు.

ద్రవ్య వినిమయ బిల్లుపై శాసనసభలో చర్చ సందర్భంగా ఆమె మాట్లాడూతూ.. పదేళ్ల పాటు ఓయూకు వెళ్లలేని పరిస్థితి తెచ్చుకున్నారని బీఆర్ఎస్పై మండిపడ్డారు. పదేళ్లు అధికారంలో ఉన్నా మీరెందుకు ఉద్యోగాలు ఇవ్వలేదని ప్రశ్నించారు. ఆశా కార్యకర్తలు, అంగన్వాడీల తల్లిదండ్రులు, చిరుద్యోగుల తల్లిదండ్రుల పింఛను తీసేసింది కేసీఆర్ ప్రభుత్వమేనని అన్నారు. ధరణి పేరుతో పేదలకు పట్టాలు ఇవ్వకుండా ఇబ్బంది పెట్టారని ధ్వజమెత్తారు. వారి వేధింపులు తట్టుకోలేకే ప్రజలు కాంగ్రెస్కు పట్టం కట్టారని వ్యాఖ్యానించారు. కేసీఆర్ పాలనలో పేదలకు ఇళ్లు ఇవ్వలేదని.. పొరుగు సేవల ఉద్యోగులకు నెలల పాటు జీతాలు ఇవ్వలేదని సీతక్క తెలిపారు.

 

Read more RELATED
Recommended to you

Latest news