కేటీఆర్ వ్యాఖ్యలకు మంత్రి సీతక్క కౌంటర్

-

బీఆర్ఎస్ పాలన రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిందని విమర్శించిన సీఎం రేవంత్ రెడ్డి పది నెలల్లో
రూ. 80,500 కోట్ల రికార్డు అప్పులు చేశారంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన
విమర్శలకు మంత్రి సీతక్క ట్విటర్ వేదికగానే కౌంటర్ వేశారు. తొమ్మిదిన్నరేళ్ళలో మీరు చేసిన
అప్పులకు వడ్డీలు కట్టడానికి కొత్త అప్పులు చేయాల్సిన దుస్థితిని తీసుకొచ్చింది మీరేనని.. అప్పుల
వారసత్వానికి ఆద్యులే మీరంటూ సీతక్క ఫైర్ అయ్యారు. మీ హయాంలో అక్షరాల రూ. 7 లక్షల కోట్ల అప్పులు చేసారని, వాటికి కిస్తీలు, వడ్డీల కోసం ప్రతి రోజూ రూ. 207 కోట్లు చెల్లించాల్సి వస్తోందని.. ప్రతి నెల సగటున 6 వేల కోట్ల ప్రజాధనాన్ని మీ అప్పుల కుప్పను కడగడానికే
సరిపోతుందని కేటీఆర్ చేసిన విమర్శలను తిప్పికొట్టారు.

అప్పుల అప్పారావు లాగా అందిన కాడల్లా అప్పులు చేసి.. రాష్ట్రాన్ని తిప్పలు పెట్టి, వడ్డీలతో ఆర్థిక వ్యవస్థ నడ్డి విరిచిన మిమ్మల్ని దేనితో కొట్టాలని నిలదీశారు. అప్పులు చాలవన్నట్లు వేల కోట్ల బకాయిలను మీరు చెల్లించలేదని, చేసిన పనులకూ బిల్లులు చెల్లించలేదని, 5 వేల కోట్ల ఫీజు రీయంబర్స్ మెంట్ బకాయిలు, ఆరోగ్య శ్రీ బకాయిలు, కాంట్రాక్టర్లకు పెండింగ్ బిల్లులు, సర్పంచులకు పెండింగ్ బకాయిలు, విద్యుత్ సంస్థలకు బకాయిలు, ఆర్టీసీకి బకాయిలు, గురుకుల భవనాల ఓనర్లకు అద్దె బకాయిలు, ఉద్యోగులకు రిటైర్మెంట్ బెనిఫిట్స్  నిధుల పెండింగ్..ఇలా ప్రతి శాఖలో వందల కోట్ల బకాయిలు పెట్టి.. ఇప్పుడు బుకాయిస్తే ఏలా? అని ప్రశ్నించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version