భారత్, న్యూజిలాండ్ మధ్య ఇవాళ జరగాల్సిన మొదటి టెస్ట్ తొలి రోజు ఆట వర్షం కారణంగా రద్దు అయింది. బెంగళూరు వేదికగా ఉదయం 9 గంటలకు మ్యాచ్ ప్రారంభం కావాల్సి ఉండగా.. రాత్రి నుంచి అక్కడ ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తూనే ఉంది. ఈ రోజు మధ్యాహ్నం వరకు వేచి చూసిన అంపైర్లు.. వర్షం తగ్గకపోవడంతో టాస్ వేయకుండానే మొదటి రోజు ఆటను రద్దు చేస్తున్నట్టు నిర్ణయం తీసుకున్నారు. కాగా ఈ టెస్ట్ సిరీస్ భారత్ తో పాటుగా న్యూజిలాండ్ జట్టుకు చాలా ముఖ్యం అనే చెప్పాలి.
టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ రేసులో ఉన్న ఇరు జట్లు గెలుపు కోసం తహతహలాడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మొదటి రోజు మ్యాచ్ రద్దు కావడంతో ఇరు జట్ల ప్లేయర్లు కాస్త నిరాశకు లోనయ్యారు. మ్యాచ్ రేపు ఉదయం 8.45 గంటలకు ప్రారంభం కానున్నట్లు అంపైర్లు పేర్కొన్నారు. మరీ రేపటి మ్యాచ్ కు అయిన వర్షం తగ్గి కనుకరిస్తుందా.. లేదా.. వర్షార్పణం అవుతుందో తెలియాలంటే రేపటి వరకు వేచి చూడాల్సిందే..!