ప్రజా ప్రభుత్వం ఏర్పడి సంవత్సర గడిచిన నేపథ్యంలో డిసెంబర్ 4న పెద్దపల్లి జిల్లాలో లక్ష మందితో బహిరంగ సభ నిర్వహిస్తున్నామన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. గత ప్రభుత్వం నిరుద్యోగ యువతీ యువకుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిందని, తమ ప్రభుత్వం 10 నెలల కాలంలో 50 వేల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేశామన్నారు. ప్రభుత్వంలో ఉన్న ఖాళీలను భర్తీ చేస్తూ ప్రైవేట్ సంస్థలో యువత ఉపాధి పొందేలా అవసరమైన నైపుణ్య శిక్షణ అందిస్తున్నామన్నారు.
సీఎం సభకు పెద్ద ఎత్తున ప్రజలు వచ్చి విజయవంతం చేయాలని మంత్రి పిలుపునిచ్చారు. పత్తిపాక రిజర్వాయర్ 2950 కోట్లతో 5 టీఎంసీల సామర్థ్యంతో నిర్మించేందుకు ప్రాథమిక అంచనాలు తయారు చేశామన్నారు. రామగుండం ఎత్తిపోతల పథకం 95 శాతం పూర్తయిందని, డిసెంబర్ నెలాఖరు వరకు పెండింగ్ పనులు పూర్తి చేసి వచ్చే సీజన్ నుంచి రైతులకు సాగు నీరు అందించాలని, పాలకుర్తి ఎత్తిపోతల పథకం ప్రతిపాదనలు, నీటి కేటాయింపుల ప్రక్రియ పూర్తి కావాలన్నారు. కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టు లోని ప్యాకేజ్ 9 పెండింగ్ పనులు, చిన్న కాళేశ్వరం పనులు త్వరగా పూర్తి చేయాలన్నారు.