Vasireddy Padma jumps to tdp party: టీడీపీ పార్టీలోకి వాసిరెడ్డి పద్మ జంప్ అవుతున్నారట. వచ్చేవారం టీడీపీలోకి వాసిరెడ్డి పద్మ వెళుతున్నారట. తాను వచ్చే వారం టీడీపీలో చేరనున్నట్లు ఏపీ మహిళా కమిషన్ మాజీ ఛైర్‌పర్సన్ వాసిరెడ్డి పద్మ ప్రకటించారు. ఇవాళ (ఆదివారం) ఎంపీ కేశినేని చిన్నితో ఆమె భేటీ అయ్యారు.
అనంతరం మరో వారం రోజుల తరువాత టీడీపీలో జాయిన్ అవుతానని ప్రకటించారు. ఆమె ఇప్పటికే వైసీపీకి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. మరోవైపు మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ల నాని సైతం టీడీపీ కండువా కప్పుకోనున్నట్లు సమాచారం.
ఇటీవల వైసీపీకి రాజీనామా చేసిన వాసిరెడ్డి పద్మ.. ఏ పార్టీలో చేరుతారని జోరుగా ప్రచారం సాగుతోంది. వైసీపీలో ఉన్నప్పుడు టీడీపీ, జనసేన పార్టీ నేతలపై విరుచుకపడిన ఆమె.. తనకు అన్ని పార్టీల్లోనూ ఆప్తులు ఉన్నారని కామెంట్ చేయడం చర్చనీయాంశంగా మారింది.