ఉజ్జయిని మహంకాళి అమ్మ‌వారికి తొలిబోనం స‌మ‌ర్పించిన త‌ల‌సాని

ఉజ్జయిని మహంకాళి అమ్మ‌వారికి తొలిబోనం స‌మ‌ర్పించారు తెలంగాణ మంత్రి వర్యులు త‌ల‌సాని శ్రీనివాస్‌ యాదవ్‌. ఈ సందర్భంగా తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ… నాలుగు గంటలకు దర్శనం చేసుకోవడం ఎంతో ఆనందం ఉందని చెప్పారు. ఈ రోజు బోనాల పండుగ వచ్చిదంటే ఈ పండగ ప్రపంచ వ్యాప్తంగా జరుపుకోవడం ఎంతో సంతోషమని చెప్పారు.

మహంకాలి జాతర విశ్వవ్యాప్తం అయ్యిందని.. ఏర్పాట్లు అన్ని డిపార్ట్మెంట్ కలసి ఎంతో బాగా చేసారని వెల్లడించారు. ఉదయం ముఖ్యమంత్రి గారు, కవిత గారు కూడా అమ్మవారిని దర్శించు కుంటారని.. అందరినీ సాదరంగా ఆహ్వానించడం జరుగుతుందని పేర్కొన్నారు.

రంగం కార్యక్రమం తర్వాత అంబారు ఊరేగింపు ఉంటుందని.. దాదాపు 3వేల దైవాలయనలను అభివృద్ధి చేశామని స్పష్టం చేశారు. దేశ వ్యాప్తంగా అనేక మంది దర్శించుకుంటారని.. ఎటువంటి ఆటంకాలు జరగకుండా ఏర్పాట్లు చేశామని తెలిపారు. మెడికల్, అంబులెన్స్ ఏర్పాట్లు చేయడం జరిగిందని.. కెసిఆర్ ముఖ్యమంత్రి అయ్యిన తరువాత అమ్మవారి దయతో అనేక ప్రాజెక్ట్ లు పూర్తి చేయడం జరిగిందని గుర్తు చేశారు.