షుగర్‌ ఉన్నవారు దానిమ్మరసం తాగొచ్చా..? తాజా పరిశోధనలు ఏం చెప్తున్నాయంటే..

-

మధుమేహాన్ని నివారించేందుకు వైద్యులు ఎన్నో పరిశోధనలు చేస్తున్నారు. కానీ అవి నియంత్రణ వరకే పరిమిత అవుతున్నాయి కానీ.. వ్యాధిని అరికట్టలేకపోతున్నాయి. నేటికీ డయబెటీస్‌ను పూర్తిగా నయం చేసే మందు లేదు. ఉన్నవన్నీ కంట్రోల్‌లో పెట్టేవే. సరైన జీవనశైలి పాటిస్తే అసలు ఈ వ్యాధి భారిన పడకుండా ఉండొచ్చు. తాజాగా జరిగిన ఓ పరిశోధనలో మధుమేహాన్ని నియంత్రించే ఓ పానియాన్ని కనుగొన్నారు. అదే..దానిమ్మ రసం. సాధారణంగా షుగర్ పేషంట్స్‌ను పండ్ల రసాలు తీసుకోవద్దని చెప్తారు. అందులో ఉండే చెక్కర షుగర్‌ లెవల్స్‌ను ఇంకా పెంచుతుందని ఇప్పటివరకూ వింటూ వస్తున్న మాట..! మరీ దానిమ్మ రసంతో షుగర్‌ ఎలా కంట్రోల్లో ఉంటుంది..?
 పరిశోధన ఎలా జరిగిందంటే..
సుమారు 236 ml దానిమ్మ రసం తాగిన వారి రక్తంలో చక్కెర తగ్గుతుంది. ఈ పరిశోధనలో 21 మంది ఆరోగ్యవంతులపై పరీక్షించారు. వారికి దానిమ్మ రసంతోపాటు నీరు ఇచ్చారు. పరిశోధనలో పాల్గొన్న వాలంటీర్లను ఫాస్టింగ్‌ సమయంలోని సీరం ఇన్సులిన్ స్థాయిల ఆధారంగా రెండు గ్రూపులుగా విభజించారు. దానిమ్మ రసాన్ని సేవించే వారి రక్తంలో చక్కెర తగ్గుతుందని పరిశోధకులు కనుగొన్నట్లు జర్నల్‌లో ప్రచురించారు. తక్కువ ఫాస్టింగ్ సీరమ్ ఇన్సులిన్ ఉన్నవారి బ్లడ్ షుగర్ కేవలం 15 నిమిషాల్లో తగ్గిపోయింది.
దానిమ్మ రసంలో ఉండే సమ్మేళనాలు గ్లూకోజ్ జీవక్రియను నియంత్రించగలవని పరిశోధకులు నిర్ధారించారు. దానిమ్మ రసంలో యాంటీ ఆక్సిడెంట్లు అధిక మొత్తంలో ఉంటాయి. ఈ పండులో ఆంథోసైనిన్లు ఎక్కువగా కనిపిస్తాయి. ఇది దాని రంగును ముదురు ఎరుపుగా చేస్తుంది. ఈ యాంటీఆక్సిడెంట్ చక్కెర, ఇన్సులిన్ స్థాయిలను నియంత్రించడంలో ప్రభావవంతంగా ఉంటుంది. న్యూట్రిషన్ రీసెర్చ్ జర్నల్‌లో ప్రచురించిన పరిశోధనలో దానిమ్మ రసం ముదురు రంగులో ఉన్నందున, టైప్ 2 డయాబెటిస్ ఉన్నవారిలో సీరం గ్లూకోజ్, ఇన్సులిన్ నిరోధకతను తగ్గించడంలో ఫాస్టింగ్ సహాయపడుతుందని కనుగొన్నారు.
సో.. షుగర్ పేషంట్స్‌ దానిమ్మ రసం తాగడం ద్వారా డయబెటీస్‌ కంట్రోల్‌లో ఉంటుందని పరిశోధనలు అయితే చెప్తున్నాయి. దీనిపై మీరు ముందుకెళ్లాలంటే..మీ వైద్యులను అయితే ఓ సారి సంప్రదించటం ఉత్తమం.!

Read more RELATED
Recommended to you

Latest news