ఖైరతాబాద్ పంచముఖ మహాలక్ష్మి గణపతి శోభయాత్ర మరికొద్ది సేపట్లో ప్రారంభం కానుంది. ఈసారి 50 అడుగుల ఎత్తుతో రూపుదిద్దుకున్న మట్టి గణపతి హుస్సేన్ సాగర్ లో నిమర్జనానికి తరలి వెళ్ళనున్నాడు. 50 అడుగుల భారీ మట్టి మహాగణపతిని ఊరేగింపుగా నిమర్జనం చేయడం ఇదే తొలిసారి. ప్రస్తుతం మహాగణపతిని భారీ క్రేన్ సహాయంతో ట్రాలీపైకి ఎక్కిస్తున్నారు. ఈ నేపథ్యంలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఖైరతాబాద్ గణేషుడిని దర్శించుకుని చివరి పూజలు చేశారు.
ఈ సందర్భంగా మంత్రి తులసాని మాట్లాడుతూ.. గణేష్ శోభాయాత్ర, నిమజ్జనం కోసం ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసిందని స్పష్టం చేశారు. మహాగణపతిని లక్షలాది మంది భక్తులు దర్శించుకున్నారని తెలిపారు. ఎలాంటి ఇబ్బందులు, ఆటంకాలు లేకుండా ఉత్సవాలు నిర్వహించామని తెలిపారు. శనివారం ఉదయం వరకు వినాయకుల నిమర్జనం ముగుస్తుందని తెలిపారు.
ఖైరతాబాద్ గణనాధుడి ని దర్శించుకొని అనంతరం గణేష్ శోభాయాత్రను ప్రారంభించడం జరిగింది. pic.twitter.com/fIVbKgrWbG
— Talasani Srinivas Yadav (@YadavTalasani) September 9, 2022