త్వరలోనే రైతు భరోసా తీసుకొస్తాం : మంత్రి తుమ్మల

-

అసెంబ్లీ ప్రాంగణంలో రైతు రుణమాఫీ నిధుల విడుదల కార్యక్రమం జరిగింది. రెండో విడత రైతు రుణమాఫీ నిధులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విడుదల చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ.. రైతులకు ఇచ్చిన హామీలు నిలబెట్టుకుంటున్నామని అన్నారు. రూ.లక్షన్నర అప్పు ఉన్న రైతులందరికీ రుణమాఫీ చేస్తున్నామని తెలిపారు. ఒకే పంటకాలంలో రూ.31 వేల కోట్లు రుణమాఫీ చేస్తున్నామని వెల్లడించారు. ఆగస్టులో రూ.2 లక్షల్లోపు ఉన్న రుణమాఫీని కూడా అమలు చేస్తామని ప్రకటించారు.

పంటలబీమా ద్వారా రైతులకు అండగా ఉంటామని మంత్రి తుమ్మల అన్నారు. త్వరలోనే రైతు భరోసా విధివిధానాలు ఏర్పాటు చేస్తామని తెలిపారు. గతంలో కంటే భిన్నంగా రైతుభరోసా విధివిధానాలు రూపొందిస్తామని చెప్పారు. ఆయిల్‌పామ్‌ పంట వేయాలని రైతులను కోరారు. ఐదేళ్లలో 5 లక్షల ఎకరాల్లో ఆయిల్‌పామ్ వేయాలని కోరుతున్నామని చెప్పారు. అనేక రాష్ట్రాలకు పామాయిల్‌ సరఫరా చేసే స్థాయికి మనం చేరాలని.. రైతే రాజు అనే నినాదానికి నిజమైన అర్థం చెబుతున్నామని పేర్కొన్నారు. మన్మోహన్‌సింగ్ హయాంలో రూ.70 వేల కోట్లు రుణమాఫీ చేశామని గుర్తు చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news