మనకు రావాల్సిన కృష్ణా జలాలను ఏపీ తీసుకెళ్తుంటే కేసీఆర్‌ సహకరించారు : మంత్రి ఉత్తమ్

-

రాష్ట్రంలోని నీటిపారుదల ప్రాజెక్టులను కృష్ణా నదీ యాజమాన్య బోర్డుకు అప్పగించే వ్యవహారంపై కాంగ్రెస్ ప్రభుత్వం, బీఆర్ఎస్ నేతల మధ్య వర్డ్ వార్ నడుస్తోంది. ఇవాళ మాజీ నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్ రావు మీడియా సమావేశం ఏర్పాటు చేసి.. రాష్ట్ర ప్రభుత్వమే ప్రాజెక్టులను బోర్డుకు అప్పగించిందంటూ ఆరోపించారు. హరీశ్ రావు ఆరోపణలపై ప్రస్తుత నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తీవ్రంగా ఫైర్ అయ్యారు.

“డిసెంబర్‌ 7న మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశాం. కేఆర్‌ఎంబీకి మా ప్రభుత్వం ప్రాజెక్టులు అప్పగించలేదు. హరీశ్‌రావు పచ్చి అబద్ధాలు చెబుతున్నారు. కృష్ణా జలాల వాటాల్లో కేసీఆర్‌, జగన్‌ కలిసి తెలంగాణకు అన్యాయం చేశారు. మనకు రావాల్సిన కృష్ణా జలాలను ఏపీకి తీసుకెళ్తుంటే కేసీఆర్‌ సహకరించారు. రాయలసీమ లిఫ్ట్‌ ఇరిగేషన్‌ ప్రాజెక్టు ఏపీ కట్టుకునేందుకు కేసీఆర్‌ సహకరించారు. పాలమూరు ప్రాజెక్టు నిర్మాణ అంచనాలను పెంచుతూ పోయారు. రూ.27 వేల కోట్లు పెట్టి పాలమూరు నిర్మించి ఒక్క ఎకరానికి నీళ్లు ఇవ్వలేదు. బీఆర్ఎస్ పదేళ్లు అధికారంలో ఉన్నా ఎస్‌ఎల్‌బీసీ పూర్తి చేయలేదు. గ్రావిటీ ద్వారా మనకు రావాల్సిన 8 టీఎంసీల కృష్ణా జలాలను వదిలేసుకున్నారు.” అని ఉత్తమ్ కుమార్ రెడ్డి ధ్వజమెత్తారు.

Read more RELATED
Recommended to you

Latest news