SLBC ని తప్పకుండా పూర్తి చేస్తామని మంత్రి ఉత్తమ్ కీలక హామీ ఇచ్చారు. తాజాగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నల్లగొండ జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో SLBC ప్రాజెక్ట్ ని పట్టించుకోలేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం SLBC కి శ్రీకారం చుట్టిందని.. తమ ప్రభుత్వ హయాంలో తప్పకుండా పూర్తి చేస్తామని తెలిపారు.
SLBC తో పాటు డిండి ఎత్తిపోతల కు సంబంధించిన పనులు పూర్తి చేస్తామన్నారు. అర్హులైన వారందరికీ ఇందిరమ్మ ఇండ్లను అందజేస్తామన్నారు. కొత్త రేషన్ కార్డులను కూడా త్వరలోనే అందజేస్తామన్నారు. వర్షాలు కురవడంతో రాష్ట్రంలో మొత్తం ప్రాజెక్టులు నీటితో కలకలలాడుతున్నాయని తెలిపారు.