ప్రాజెక్టుల పేర్లతో రాష్ట్ర ఖజానాను BRS దోపిడీ చేసింది..!

-

ప్రాజెక్టుల పేర్లతో రాష్ట్ర ఖజానాను BRS దోపిడీ చేసింది అని భట్టి విక్రమార్క అన్నారు. 1450 కోట్లతో పూర్తయ్యే రాజీవ్, ఇందిరా సాగర్ ప్రాజెక్టులను రీ డిజైన్ చేసి సీతారామ ప్రాజెక్టుగా పేరు మార్చి రూ. 23 వేల కోట్లకు అంచనాలు పెంచి రాష్ట్ర ఖజానాను BRS ప్రభుత్వం దోపిడీ చేసింది. సీతారామ ప్రాజెక్టుపై ఎనిమిది వేల కోట్ల రూపాయల ఖర్చుపెట్టి ఒక ఎకరానికి కూడా BRS ప్రభుత్వం నీళ్లు ఇవ్వలేదు.

కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత సీతారామ ప్రాజెక్టు పై పెట్టిన ఖర్చు వృధా కాకుండా ఉండడానికి ముఖ్యమంత్రి భద్రాచలం పర్యటనకు వచ్చినప్పుడు ఇంజనీర్లతో కలిసి రాజీవ్ గాంధీ లింకు కెనాల్ ను ప్రతిపాదించాం. కేవలం 75 కోట్ల రూపాయలు తో రాజీవ్ లింకు కెనాల్ ను మూడు నెలల్లో పూర్తి చేసి ఒక లక్ష 50 వేల ఎకరాలకు సాగునీరు అందించే కార్యక్రమం చేపట్టాం. మూడు నెలల్లో రాజీవ్ లింకు కెనాల్ కాలువను పూర్తి చేసి రైతులకు నీళ్లు ఇవ్వడం అనేది కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉన్న నిబద్ధతకు నిదర్శనం అని భట్టి తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news