సూర్యాపేట జిల్లా.. కోదాడ పట్టణంలో నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి కలిసి మీడియా సమావేశం ఏర్పాటు చేసారు. ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ మాట్లాడుతూ.. సుప్రీంకోర్టు ఆదేశాలతో ఎస్సీ వర్గీకరణ పై ముందుకు తీసుకెళ్తున్నాం అన్నారు. ఇక 2700 కోట్లతో రైతు రుణమాఫీ కి ఇవ్వడం జరిగింది. 850 కోట్లు రైతుల మీద వడ్డీ భారం పడింది.
బీఆరెస్ ఔటర్ రింగ్ రోడ్డు అమ్మేసి 1700 కోట్లు సొమ్ము చేసుకుంది. పదేళ్లలో బీఆర్ఎస్ ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదు. మేము అధికారంలోకి వచ్చి సంవత్సరం పూర్తి కాకముందే 50 వేల ఉద్యోగాలు భర్తీ చేశాం అని పేర్కొన్నారు. అలాగే పొల్యూషన్ నివారణకు ఎలక్ట్రికల్ బస్సు కొనుగోలు చేసింది. ప్రతి నియోజకవర్గానికి ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మిస్తున్నాం. అత్యధిక పరిశ్రమలు నిర్మిస్తున్నాం. ఈనెల నుంచి ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం ప్రారంభిస్తాం అని మంత్రి ఉత్తమ్ పేర్కొన్నారు.