పెద్ద ఎత్తున ఉద్యోగ నియామకాలు చేపడుతూ… నియామక పత్రాలు అందించడం… ఆనందంగా ఉంది అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. బడుగు, బలహీన వర్గాల అవసరాల ను తీర్చడం కోసం.. ప్రతినెల ఆరోగ్య శాఖ కు నిధులు విడుదల చేయాలంటే నీళ్ళు మింగాల్సిన పరిస్థితి ఉంది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి ఆరోగ్య శాఖ పై ప్రత్యేక దృష్టి సారించి ముందుకు సాగుతున్నము. గ్రామీణ ప్రాంతాల్లో వైద్య సదుపాయాలు , పేదవారికి, మధ్యతరగతి లో గానీ ఆయా కుటుంబాల్లో ఆరోగ్యం విషమిస్తే… ఆర్థికంగా పెట్టుకోలేక అనేక ఇబ్బందులు పడ్డారు.
అందుకే రాజీవ్ ఆరోగ్య శ్రీ పథకం లో 5 లక్షల నుంచి 10 లక్షలకు పెంచాం.ప్రభుత్వ ఆస్పత్రుల్లో మందులు, సదుపాయాల కల్పన విషయంలో పూర్తి స్థాయిలో మేము అందించే ప్రయత్నం చేస్తున్నాం. కానీ గత పదేళ్ళు ఆరోగ్య శాఖ నిర్లక్ష్యానికి గురైంది. రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి వెళ్ళారు.. ఇప్పుడు వాటికి అతికష్టం మీద వడ్డీలు కడుతున్నం. సంవత్సరం కూడా అధికారం లేకపోతే ఉండలేక పోతున్నారు అని భట్టి విక్రమార్క పేర్కొన్నారు.