నాకు అరెస్ట్ వారెంట్ ఇవ్వలేదు : RGV

-

తన మీద పెట్టిన కేసు గురించి దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కీలక కామెంట్స్ చేసారు. నేను సంవత్సరం క్రితం ఒక ట్వీట్ పెట్టాను.. ఇప్పుడు చాలానే ట్వీట్స్ పెడుతున్నాను. గతంలో నేను పెట్టిన ట్వీట్ వల్ల ఎవరివో మనోభావాలు దెబ్బతిన్నాయి.. కేసు పెట్టారు. నాపైన ఒక కేసు పెట్టారు.. అదే కేసును ఐదారు ప్లేసెస్ లో పెట్టారు అని RGV వివరించాడు. ఇక ఏడాది తరువాత వాళ్ళకి ఇప్పుడే ఎందుకు గుర్తుకు వచ్చాయో నాకు తెలియదు. సుప్రీం కోర్ట్ గైడ్ లైన్స్ ప్రకారం వీడియో కాల్ లో విచారణకు హాజరవుతాను అని చెప్పాను. విచారణకు వీడియో కాల్ లో హాజరవుతాను అని మెసేజ్ పెట్టిన పది నిమిషాలకు పోలీసులు వచ్చారు.

ఇక ఇప్పటి వరకు కేసు గురించి పోలీసులే మాట్లాడలేదు కానీ మీడియా మాట్లాడుతున్నారు.. మీడియా జరగకున్నా కూడా జరిగింది అంటూ చూపిస్తుంది. మెయిన్ స్ట్రీమ్ మీడియా సోషల్ మీడియా కంటే డేంజర్ అయ్యింది. నేను మా డెన్ లోనే ఉన్నాను.. మీడియాకి ఇంటర్వ్యూ ఇస్తుంటే లేనని చెబుతున్నారు. నాకు అరెస్ట్ వారెంట్ ఇవ్వలేదు.. అరెస్ట్ చెయ్యడానికి వచ్చామని పోలీసులు చెప్పలేదు. అయినా నేను ఒక ట్వీట్ పెడితే 90% నన్ను బూతులు తిడుతారు అని వర్మ పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news