అత్యున్నత ప్రమాణాలతో యంగ్ ఇండియా తెలంగాణ ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ నిర్మాణం జరుగుతుంది. 200 కోట్ల రూపాయలతో స్కూల్ నిర్మాణం జరగబోతుంది అని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. భట్టి విక్రమార్క గాంధీ కుటుంబానికి అత్యంత సన్నిహితుడు. కాంగ్రెస్ పార్టీకి విధేయుడు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ఎంతో కృషి చేశాడు. భట్టి విక్రమార్క సమర్థవంతమైన నాయకత్వంతో రైతు రుణమాఫీ చేసాం.
ఇక పరిచయం అవసరంలేని వ్యక్తి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. అన్ని స్థాయిల్లో కాంగ్రెస్ పార్టీకి సేవలందించిన ఘనత కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. నియోజకవర్గ ప్రజలే నా కుటుంబ సభ్యులు.. మీ జీవితాల్లో వెలుగులు నింపేందుకు మా జీవితాన్ని త్యాగం చేశాం. రాష్ట్రాన్ని దేశంలోనే నెంబర్ వన్ రాష్ట్రంగా తీర్చిదిద్దుతాం. ధాన్యం కొనుగోలు ప్రక్రియ వేగంగా, పారదర్శకంగా పూర్తి చేస్తాం. 150 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం ఈసారి మార్కెట్ కు రాబోతుంది. అలాగే జనవరి నుండి రేషన్ కార్డు దారులకు సన్న బియ్యాన్ని ఇవ్వబోతున్నాం అని మంత్రి ఉత్తమ్ పేర్కొన్నారు.