విద్యుత్ కమీషన్ పై కావాలని లీక్ లు ఇస్తున్నారు. కమీషన్ విచారణ పూర్తి అయితే నివేదిక ఎందుకు బయట పెట్టట్లేదు అని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ప్రశ్నించారు. కేసీఆర్ ను జైల్లో ఎందుకు పెడతారు అని దుష్ప్రచారం చేస్తున్నారు. అయితే కేసీఆర్ ను జైల్లో పెట్టే దమ్ముందా అని అడిగారు. 24 గంటలు కరెంట్ ఇచ్చినందుకు కేసీఆర్ ను జైల్లో పెడతారా.. విద్యుత్ సంస్కరణలు చేసినందుకు కేసీఆర్ ను జైల్లో పెడతారా అని ప్రశ్నించారు.
అలాగే ఒవైసీ గురించి ముస్లిం సోదరులను అడిగితే చెప్తారు. మూసి ప్రక్షాళన చేస్తాం అని మేమే చెప్పాము. ఒవైసీ కొత్తగా చెప్పేది ఏముంది. రేవంత్ రెడ్డి మోదీని తిట్టినా బీజేపీ నేతలు సైలెంట్ గా వున్నారు. రేవంత్ రెడ్డిని విమర్శించే మొగోడు బీజేపీలో లేడు. రైతు రుణమాఫీ అందరికీ కాలేదని వ్యవసాయ శాఖామంత్రి అంటున్నారు. రెండు లక్షల మందికి రుణమాఫీ అయిందని.. సీఎం రేవంత్ రెడ్డి దబాయిస్తున్నారు. కానీ అరెస్టులతో ఉద్యమాన్ని రేవంత్ రెడ్డి ఆపలేరు అని జగదీష్ రెడ్డి పేర్కొన్నారు.