నేటి నుంచి ఆకాశంలో అద్భుతం జరుగనుంది. నేటి నుంచి 5 రోజుల పాటు ఆకాశంలో ఈ అద్భుతం జరుగనుందన్న మాట. ఆకాశం నుంచి భూమిపైకి రాలే ఉల్కాపాతాలను ప్రజలంతా నేరుగా చూడొచ్చని ప్లానెటరీ సొసైటీ ఆఫ్ ఇండియా హైదరాబాద్ సంచాలకులు శ్రీ రఘునందన్ కుమార్ తెలిపారు.

డిసెంబర్ 16 నుంచి 20 వరకు రాత్రి తొమ్మిది గంటల నుంచి తెల్లవారుజామున 5 గంటల వరకు వేర్వేరు సమయాల్లో కాంతివంతమైన ఉల్కా పాతాలు కనిపిస్తాయని పేర్కొన్నారు. పాతియాన్ అనే గ్రహశకలం సూర్యుడి చుట్టూ తిరిగే క్రమంలో కొద్దినెలల క్రితం భూకక్ష్యలోకి ప్రవేశించింది. ఇది కొన్ని పదార్థాలతో కలిసి రాపిడికి గురై చిన్న చిన్న ఉల్కలుగా రాలిపడుతుంది. ఈ క్రమంలో ఇవి గంటకు 150 కాంతి పుంజాలను వెదజల్లుతాయని అంతర్జాతీయ ఉల్కాపాత సంస్థ వెబ్ సైట్ లో తెలిపింది.