తెలంగాణ రాష్ట్రంలో విషాదం చోటు చేసుకుంది. రోడ్డు ప్రమాదంలో ‘మిస్టర్ తెలంగాణ’ మృతి చెందాడు. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. సిద్దిపేట జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రముఖ బాడీ బిల్డర్, ‘మిస్టర్ తెలంగాణ’ విజేత మహ్మద్ సోహైల్(23) మృతి చెందారు. సిద్దిపేటకు చెందిన సోహైల్.. బైక్‌పై వెళ్తూ స్క్రాప్ ఆటోను ఢీకొట్టాడు.
ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఆయన.. హైదరాబాద్‌లోని ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. సోహైల్ అనేక జిల్లా, రాష్ట్ర స్థాయి, దక్షిణ భారత స్థాయి బాడీ బిల్డింగ్ ఛాంపియన్‌షిప్‌లను గెలుచుకున్నారు. కాగా… ప్రముఖ బాడీ బిల్డర్, ‘మిస్టర్ తెలంగాణ’ విజేత మహ్మద్ సోహైల్(23) మృతి చెందడంపై సోషల్ మీడియాలో చాలా సంతాపం తెలుపుతున్నారు. అటు…ప్రముఖ బాడీ బిల్డర్, ‘మిస్టర్ తెలంగాణ’ విజేత మహ్మద్ సోహైల్ మృతిపై పోలీసులు కూడా దర్యాపతు చేస్తున్నారు.